15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చోరీ కేసును ఛేదించిన పోలీసులు

22-02-2026 12:00 AM

ఇద్దరు నిందితుల అరెస్ట్

రూ.40 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం

సికింద్రాబాద్ ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గృహచోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీ నం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 16న బేగంపేట్లోని శ్యాంలాల్ బిల్డింగ్స్లో ఉన్న సత్యకృష్ణ సిరిసంపద అపార్ట్మెంట్స్ నివాసి ఎం. అనురాధ (60) ఫిర్యాదు చేశారు.

15న కుటుంబ కార్యక్రమం నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి లోపల ఉన్న అల్మిరా ధ్వంసం చేసి బంగారు చెవిపోగులు, ఉంగరాలు, గొలుసులు, వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదు దొంగిలించినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా ఈ నెల 21న సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టాండ్ ప్రాంతం లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు బి.సాయి ప్రదీప్ (25), ఎడ్ల ప్రవీణ్ కుమార్ (32)గా గుర్తించారు. వారి వద్ద నుంచి 235 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.65 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసిన ఆస్తి విలువ సుమారు రూ.40 లక్షలు.విచారణలో నిందితులు చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో కూడా చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.