11 April, 2026 | 6:41 AM

ఇనుగుర్తిలో నేడు పోలీస్ స్టేషన్ ప్రారంభం

02-10-2025 12:05 AM

మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేసిన పోలీస్‌స్టేషన్‌ను నేడు గురువారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించినప్పటికీ, అనువుగా లభించకపోవడంతో మండల కేంద్రంలోని ఒకరి గృహంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. పోలీస్ స్టేషన్  ఏర్పాటు చేయ తలపెట్టిన భవనానికి బుధవారం రాత్రి రంగులు వేయించారు.