02-10-2025 12:06:27 AM
మహబూబాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో 25 ఎంపీటీసీ, 50 సర్పంచ్, 6 జెడ్పిటిసి, 150 వార్డు మెంబర్లు స్థానాలలో పోటీకి సన్నద్ధం కావాలని, సిపిఐ జిల్లా ఎన్నికల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి పిలుపు నిచ్చారు. సిపిఐ జిల్లా అత్యవసర ఎన్నికల సమావేశం వీరభవన్ లో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి మాట్లాడుతూ రాబోతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికలకు జిల్లాలోని కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సయోధ్యకుదురుచుకొని ముందుకు పోయామన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తో సయోధ్య కై చర్చలు జరుగుతున్నాయన్నారు.
ఈ ఎన్నికల్లో కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ఉద్యోగ, కార్మిక, రైతాంగ, విద్యార్థుల సమస్యలపై అనునిత్యం పోరాడుతున్నామని సిపిఐ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. నిత్యం ప్రజల కోసం ఉద్యమించే సిపిఐ అభ్యర్థుల కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి.అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మేర విశ్వేశ్వరరావు, పెరుగు కుమార్, కట్లోజు పాండురంగ చారి, చింతకుంట్ల వెంకన్న, వరిపల్లి వెంకన్న, కరణం రాజన్న, నెల్లూరు నాగేశ్వరరావు, తండ సందీప్, చొప్పరి శేఖర్, సారిక, శ్రీనివాస్, మారగాని బాలకృష్ణ, జంపాల వెంకన్న, తురక రమేష్, బైస స్వామి, మాలోతు రవీందర్, వీరవెల్లి రవి, కొమ్ము నారాయణ, తూటి వెంకటరెడ్డి లక్ష్మణ్ పాల్గొన్నారు.