calender_icon.png 2 October, 2025 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌తోనే ప్రజాసంక్షేమం

02-10-2025 12:05:21 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి 

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీతోనే ప్రజాసం క్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని నార్నూర్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బిఆర్‌ఎస్ లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌహాన్ యశ్వంతరావు తోపాటు పలువురికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన BRS, Public Welfare, MLA Kova Lakshmi, Kumram Bheem Asifabad, Constituency, Narnoor Mandal, Congress leaders, Congress senior leader, KCR, Chauhan Yashwantrao,తోనే సాధ్యమవుతుందని, ప్రజలు బిఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సరైన గౌరవం , గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు మార్సుకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ బీఆర్‌ఎస్‌కే పట్టం కడతారు

ఆదిలాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీకి పట్టంకట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. సాత్నాల మండలం యువజన కాంగ్రెస్ నాయకుడు సతీష్ కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై అసంతృప్తితో బుధవారం మాజీ మంత్రి సమ క్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా పార్టీలో చేరిన వారికి మాజీ మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు జోగు రామన్న మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆదిలాబా ద్ అభివృద్ధిపై దృష్టి సారించకుండా మాటలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెట్టు ప్రహ్లాద్, దేవన్న, లక్ష్మణ్, ప్రమోద్, మతిన్ పాల్గొన్నారు.