27 May, 2026 | 4:16 PM

బండి భగీరథ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

27-05-2026 02:32 PM

హైదరాబాద్: పోక్సో కేసులో నిందితుడు, కేంద్ర మంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్(Bandi Bhagirath) ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కూకట్ పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి బగీరథ్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. పోక్సో చట్టం కేసులో అరెస్టు అయిన బండి భగీరథ్‌ను తదుపరి విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మేడ్చల్ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. 17 ఏళ్ల మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 25 ఏళ్ల బండీ సాయి బగీరత్‌పై 8 మే 2026న ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల తర్వాత హైకోర్టు వెకేషన్ బెంచ్ అతని మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన ఒక రోజు తర్వాత బండి బగీరత్‌ను అరెస్టు చేశారు.