calender_icon.png 21 November, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిజ్రాలకు పోలీస్ వార్నింగ్.. బలవంతంగా వసూలు చేస్తే కఠిన చర్యలు

21-11-2025 11:58:13 AM

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రోడ్లపై, కాలనీల్లో, ఫంక్షన్లలో, ఇళ్లు దావత్ తో పెళ్లిళ్లలో హిజ్రాల వేధింపులు ఎక్కువయ్యాయి. ఇల్లు ఓపెనింగ్, ఇంటి ముందు టెంట్, పందిళ్లు, డప్పు చప్పుడు వినిపిస్తే చాలు వచ్చేస్తున్నారు. వాళ్ళు అడిగినంత ఇవ్వక పోవడంతో ఇష్టానుసారంగా రెచ్చిపోతూ బూతు పురాణం మొదలు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా గ్రూపులు  కట్టి దాడులు చేస్తున్నారు. హిజ్రాల వేధింపులపై ఇటీవల పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు, బలవంతపు డబ్బు వసూళ్లను అరికట్టే ప్రయత్నంలో అమీన్‌పూర్ పోలీసులు పోలీస్ స్టేషన్(Ameenpur Police Station) పరిధిలోని 60 మంది ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. వివాహాలు, వాణిజ్య సంస్థలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రజలను బెదిరించే లేదా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు ఏవైనా కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా శ్రీశైలం జాతీయ రహదారిపై హిజ్రాలు అర్ధనగ్న ప్రదర్శనతో రెచ్చిపోయారు. దీంతో పలువురు వాహనదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హిజ్రాలను స్టేషన్ కు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.