calender_icon.png 21 November, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ముర్ము

21-11-2025 12:08:49 PM

తిరుపతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) శుక్రవారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Tirumala Tirupati Devasthanams) పూజలు చేశారు. తిరుమల శ్రీ మహా ద్వారంకు వెళ్లే ముందు రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామిని దర్శించుకున్నారు. వారాహస్వామి దర్శనం అనంతరం ఆమె శ్రీవారి సేవకు వెళ్లారు. మహా ద్వారం వద్ద రాష్ట్రపతికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. రాష్ట్రపతికి ఇస్తికఫాల్ స్వాగతం పలికిన వారిలో అధికారులు, అర్చకులున్నారు. రంగనాయకుల మండపంలో  రాష్ట్రపతికి పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం అర్చకులు, అధికారులు రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. "రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులు, పరివారంతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ గుడిలో ప్రార్థనలు చేశారు" అని ఆలయ సంస్థ నుండి అధికారిక ప్రకటన తెలిపింది.