19-07-2025 12:53:54 AM
భద్రాచలం డివిజన్ తెలుగుదేశం పార్టీ డిమాండ్
భద్రాచలం, జులై 18, (విజయ క్రాంతి):భద్రాచలం శాసనసభ నియోజకవర్గం పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి మరమ్మత్తుల వలన వెంకటాపురం నుండి అలుబాక వరకు రహదారిపై ఇసుక లారీలు తిరగడం వలన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. ఈ గుంతల కారణంగా అంబులెన్స్లు, బస్సులు వంటి రవాణా వాహనాలు కూడా రోడ్డు మీద వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, రహదారి పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున అధికారులు వెంటనే రహదారి మరమ్మతులకు వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం తెలుగుదేశం పార్టీ నాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏఓ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తాళ్లూరి చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్, కంభంపాటి సురేష్ కుమార్, కుంచాల రాజారాం, కొడాలి చంటి,రేపాక రాంబాబు,అబ్బినేని శ్రీనివాస్, కొండవీటి అశోక్, కానమిల్లి రాఘవ, వెంకటాపురం తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొనే బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.