మాసానిపల్లి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులంతా కాంగ్రెస్ వైపు
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అభివృద్ధి ప్రభావం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసంపల్లి గ్రామంలో రాజకీయ పరిమాణం చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డితో పాటు వార్డు సభ్యులందరూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమయ్యాయి.సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు, ఎస్.హెచ్.జి భవనం ధాన్యం నిర్వ గోదాం వంటి కీలక అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంజూరు చేయడంతో గ్రామంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని
గ్రామ సర్పంచి పెద్దపట్లల సునంద కిషన్ రెడ్డి, మరియు పాలకవర్గం తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మాసానిపల్లి గ్రామ సర్పంచ్,వార్డు సభ్యులను సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ పరిమాణంతో ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజకీయాలు రాజ్యాంగ సంచరించుకుంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునంద కిషన్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరిగే విట్టల్, మండల సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, రామచంద్రారెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.






