రాజకీయ పార్టీలకు ‘సర్’ గుబులు!
ఒక నియోజకవర్గంలో కేవలం 2-3 శాతం ఓట్ల మార్పు కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు, సవరణ, తొలగింపులపై ఎప్పటికప్పుడు డేటాను సేకరిస్తూ, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల జాబితాను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగాయి.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించి, అర్హులైనవారికే ఓటుహక్కు ఉండేలా చూసేం దుకు ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’ (సర్) నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. భారతదేశ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే రెండు దశలు పూర్తికాగా, తెలంగాణ సహా దేశంలోని 16 రాష్ట్రాల్లో మూడో దశను ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియతో సమన్వయం చేసుకుం టూ, అదే యంత్రాంగం ద్వారా ఈ ఓటర్ల సవరణను కూడా పూర్తిచేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
హిమాచల్‌ప్రదే శ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలి త ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుం ది. ప్రజాప్రాతినిధ్య చట్టం- సెక్షన్ 21 ప్రకారం తుది జాబితా అక్టోబర్ 1వ తేదీగా నిర్ణయించారు. మొత్తం 16 రాష్ట్రాల్లో సుమారు 3.94 లక్షల అధికారు లు 36.73 కోట్ల మంది ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి వివరాలు సేకరించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ తరహా సమగ్ర సర్వే జరుగుతోంది.
బీఎల్వోలు 2002 నాటి డేటాతో పాటు ప్రస్తుత జాబితాను వెంట తెచ్చుకుంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు రెండు గణన పత్రాలను (ఎన్యుమరేషన్ ఫామ్స్) అందిస్తారు. వాటిని భర్తీచేసిన తర్వాత ఒక ప్రతి ని అధికారులు తీసుకొని, రెండో ప్రతిని ఓటరుకు రశీదుగా ఇస్తారు. ఓటర్లు ఆన్‌లై న్ ద్వారా కూడా తమ వివరాలను సమర్పించే వెసులుబాటు కల్పించారు. అయి తే, ఆన్‌లైన్ దరఖాస్తులను కూడా అధికారులు ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా ధ్రువీకరించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా మూడో దశ సర్‌కు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు తెలంగాణలో నెలరోజుల పాటు ఇంటింటి సర్వే చేసి, అక్టోబ ర్ 1న తుది జాబితా ప్రకటించనుండటం తో రాజకీయ పార్టీలకు గుబులు పట్టుకు న్నది. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండాలంటే రాజకీయ పార్టీల పాత్ర కీలకం. ప్రతి పోలింగ్ బూత్ వద్ద పార్టీలు తమ ప్రతినిధులను నియమించే ప్రక్రియను ప్రారం భించారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూ డా ఉంటే నకిలీ ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించడం సులభమవుతుంది. గత రెండు దశల్లో జరిగిన సర్వే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
పైలట్ ప్రాజెక్టు గా బీహార్‌లో జరిగిన మొదటి దశలో 47 లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించా రు. రెండో దశలో 9 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో మొత్తం 7.36 కోట్ల మంది ఓటర్లను తొలగించి, 2.18 కోట్ల మంది కొత్త ఓటర్లను చేర్చారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 2.05 కోట్ల మంది పేర్లను జాబితా నుంచి తొలగించడం గమనార్హం. ఓటర్ల జాబితాలో అర్హులైనవారు మాత్ర మే ఉండాలనేది ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం. చనిపోయినవారు, ఒకే పేరుతో రెండుచోట్ల ఓటు ఉన్నవారు (డూప్లికేట్), శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు,
అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే ‘సర్’ లక్ష్యం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనది కాబట్టి ఓటర్లందరూ ఈ సర్వేలో పాల్గొని తమ వివరా లను సరిచూసుకోవాలని ఎన్నికల సం ఘం విజ్ఞప్తి చేస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బీజేపీ సహకారంతో రంగంలోకి దిగి లక్షలాది మంది పేర్లు తొలగిస్తున్నారన్న ఆరో పణలు ఈ ప్రక్రియను అసాధారణంగా మార్చేసింది. ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నదనే అపవాదు భారత ఎన్నికల సంఘంపై బలంగా పడింది. ఎన్నికల కమిషనర్ ఎంపిక దగ్గర నుంచి, సర్‌తో ఓటర్ల జాబితాలో కావాలనే విపక్ష పార్టీల అనుకూల ఓటర్ల పేర్లును గుర్తించి తొలగించడం, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించారని బెంగాల్‌లో ఆరోపణలు వచ్చాయి.
ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ఎన్నికల సంఘం ప్రతిష్ట దెబ్బతిన్నది. ఒక నియోజకవర్గంలో కేవలం 2-3 శాతం ఓట్ల మార్పు కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు, సవరణ, తొలగింపులపై ఎప్పటికప్పుడు డేటాను సేకరిస్తూ, తమకు అనుకూలంగా ఉన్న ఓటర్ల జాబితాను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగాయి.
క్షేత్రస్థాయిలో ఏజెంట్లు లేకపోతే ఓట్ల తొలగింపు ను అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించిన పార్టీలు ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. తెలంగాణలో మొత్తం 83.04 లక్షల కుటుంబాలు, 3.39 కోట్ల ఓటర్లను నిర్ధారణ చేయడానికి బీఎల్వోలు, ఓటర్లు భౌతికంగా అందుబాటులో ఉండాలని, లేని పక్షంలో సంబంధిత 11 రకాల కార్డులను ప్రామాణికంగా తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. సర్ ఏరివేతలో ఎక్కువగా మైనారిటీ ఓట్లు గల్లంతై బెంగా ల్ మాదిరిగా కలిసివస్తుందనే దింపుడు కళ్లెం ఆశతో బీజేపీ ఎదురుచూస్తున్నది. అయితే ఈ ఎన్నికల్లో అసలు మార్పు తీసుకురాగల అంశం ఓటర్ల జాబితా సవరణే, ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకం క్షీణిస్తే, అది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవర ణ (సర్)పై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాయి. ఓటరు జాబితా ప్రక్షాళన అనేది పార్టీల గెలుపు, ఓటములలో కీలకపాత్ర పోషించనున్నది. అందుకే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరుగుతున్న సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎవరికీ వారే జాగ్రత్తపడేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వ్యక్తులు గ్రామా ల్లో లేరనే కారణంగా అర్హులైన ఓటర్లను తొలగించే అవకాశాలున్నాయని, ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచి స్తున్నారు. అందుకనుగుణంగా వ్యవహరించేందుకు కార్యాచరణ ప్రారంభించారు.
సర్ వల్లే ఫలితాలు తారుమారు అయ్యాయని నాడు బీహార్, నేడు బెంగాల్‌లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల స్వల్ప తేడాతో ఓడిపోవడం అనుమానాలకు తావిచ్చింది. సర్‌లో తొలగించిన ఓట్ల పునరుద్ధరణ కోసం వేలల్లో అప్పీళ్లు పెండింగ్‌లో పెట్టి, వాటిని పరిష్కరించకుండానే వందల ఓట్లతో బీజేపీ గెలిచిందనే విమర్శలు ఉన్నాయి. ఓటరు జాబితా సమగ్ర సవరణ పూర్తయ్యే వరకు రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓట రు జాబితా సవరణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఈ సమయంలో ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే ఓటు గల్లంతయ్యే అవకాశం ఉందని అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రంలో దాదాపు 50 లక్ష ల వరకు ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం అధికారు లు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంతా ప్రస్తుతం సర్‌పై ఎక్కువగా దృష్టిసారించారు. అయితే, సర్ ప్రభావం రెండేళ్ల తర్వాత జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలపై, ఆ తర్వాత జరుగనున్న లోక్‌సభ ఎన్నికలపై ఎలా ఉంటుందోనన్న భయం అన్ని పార్టీలను వెంటాడుతున్నది. అయితే, పార్టీల బలాబలాలను బేరీజు వేసుకోవడానికి రెండేళ్ల సమయం ఉండ టం కొంత ఊరట కలిగిస్తున్నది.
వ్యాసకర్త సెల్: 9866255355






