21 May, 2026 | 2:41 AM

స్మార్ట్‌ఫోన్‌కు బాల్యం బందీ

21-05-2026 12:00 AM

ఒకప్పుడు పద్నాలుగేళ్ల పిల్లవాడి ప్రపంచంలో పాఠశాల, స్నేహితులు, ఆటలు, కలలు మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడు? స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వారి ప్రపంచంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ విజ్ఞానం ఇస్తుంది, అదే సమయంలో అది విషవిలయం లాంటిది. మన సమాజం ఇప్పటికీ స్క్రీన్ టైమ్ గురించి మాట్లాడుతోంది. కానీ, నిజానికి సమస్య స్క్రీన్ టైమ్ కాదు. సమస్య స్క్రీన్ కంటెంట్. ఒక పిల్లా డు మూడు గంటలు చదువుతో గడిపితే అది అతని అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ, అదే పిల్లవాడు మూడు గంటలు రీల్స్‌లో గడిపితే అది క్రమంగా మెదడు మార్పునకు దారితీస్తుంది. ఇది కేవలం టైమ్‌వేస్ట్ కాదు, న్యూరోలాజికల్ రీప్రోగ్రామింగ్.

అడొలసెంట్ బ్రెయిన్‌లో ప్రీఫ్రాం టల్ కార్టెక్స్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి 24- ఏళ్లు పడుతుంది. అదే భాగం నిర్ణయాలు తీసుకోవడం, మంచి, చెడు అర్థం చేసుకోవడం, ఇంపల్స్‌ను కంట్రోల్ చేయ డం లాంటి పనులు చేస్తుంది. అంటే ఈ వయసులో పిల్లలకు ఫిల్టర్ ఇంకా సిద్ధంగా లేదు. కానీ, అదే సమయంలో డోపమైన్ సిస్టమ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తక్ష ణ ఆనందం, వెంటనే రివార్డ్, కొత్త స్టిమ్యులేషన్ వారిని బలంగా ఆకర్షిస్తా యి. ఈ పరిస్థితిలో సోషల్ మీడియా పనిచేసే విధానం చూస్తే అసలు ప్రమాదం అర్థమవుతుంది. ప్రతి స్క్రోల్ ఒక కొత్త వీడియో, ప్రతి వీడియో ఒక కొత్త స్టిమ్యులేషన్, ప్రతి స్టిమ్యులేషన్ ఒక చిన్న డోప మైన్ హిట్. బ్రెయిన్ ‘ఇది మళ్లీ కావాలి’ అని అంటుంది. అలా స్క్రోల్ ఒక అలవాటుగా కాదు, ఒక బానిసత్వంగా మారుతుంది.

2025లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 10 వయసు పిల్లల్లో 65 మందికి స్మార్ట్‌ఫోన్ యాక్సెస్ ఉంది. వారి సగటు స్క్రీన్ టైమ్ రోజుకు 3 గంటలు. వారు 60 శాతం వరకు షార్ట్ వీడియోలు చూస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా టీనేజ్ పిల్లల్లో 70% సోషల్ మీడియాను నిత్యం వినియోగిస్తున్నారు. 50% పైగా పిల్లలు అనుచిత కంటెంట్‌ను చూస్తున్నారు. ఇది ఒక మానసిక రోగానికి ప్రమాద సంకేతం. ఇక్కడ సమస్య స్క్రీన్ కాదు, ఆ స్క్రీన్ వెనుక ఉన్న అల్గోరిథమ్.

ఇది నెమ్మదిగా జరిగే ఒక మానసిక మార్పు. కానీ, దాని ప్రభావం వేగంగా, లోతుగా ఉంటుంది. మనం రేపటి నవతరాన్ని నిర్మిస్తున్నామా? లేక మానసిక  సం క్షోభాన్ని సృష్టిస్తున్నామా? ఈ ప్రశ్న ఒక్క కుటుంబానిదే కాదు, ఒక దేశం ఎదుట నిలిచిన ప్రశ్న. నేటి పిల్లలు ఇంట్లో, పాఠశాలలో కాదు, తమ చేతిలో ఉన్న చిన్న స్క్రీన్‌లో నేర్చుకుంటున్నారు. కొన్ని సెకన్ల వీడియోలు, అంతులేని స్క్రోలింగ్, కంటెం ట్ అనే పేరుతో వారి మెదళ్లలోకి ప్రవేశిస్తున్నది ప్రవర్తన. ఇవే పిల్లల గురువులు. చూసేదే వారు అనుకరిస్తారు. అదే వారి వ్యక్తిత్వంగా మారుతుంది. ఇదే అసలు సమస్య. ఇది పిల్లాడి తప్పా? లేక మనం నిర్మించిన ప్రపంచం తప్పా? 

ఇది వినోదం కాదు, ఇదొక వ్యాపారం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీ పిల్లల మంచిని లక్ష్యంగా పెట్టుకోవడం లేదు, వాళ్ల దృష్టిని ఎక్కువసేపు పట్టుకోవడమే లక్ష్యం. అల్గోరిథమ్ ఒక నిశ్శబ్ద గురువు లాంటిది. అది మీరు ఏ వీడియో దగ్గర ఆగారో చూస్తుంది, ఏది ఎక్కువగా మీ దృష్టిని ఆకర్షించిందో నేర్చుకుంటుంది, అదే తరహా కంటెంట్‌ను మరింతగా మీ ముందుంచుతుంది. ఎక్కువగా ఆగే కంటెంట్ ఏది? షాక్ ఇచ్చే కంటెంట్, అశ్లీలత, అసహజ ప్రవర్తనలు, హద్దులు దాటే ప్రదర్శనలు.. ఎందుకంటే ఇవే మనసును ఎక్కువగా పట్టుకుంటాయి. ఈ క్రమంలో పుస్తకం చదవడం కంటే రీల్ చూడడం సులువని పిల్లాడు అనుకుంటాడు. కష్టపడి ఏదైనా సాధించడం కంటే వెంటనే ఆనం దం ఇచ్చే వీడియోలు అతనికి ఆకర్షణీయంగా మారుతాయి. దీని ఫలితం ఏమిటంటే, సహనం తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గిపోతుంది, లోతైన ఆలోచన దాదాపు మాయమవుతుంది.

ఈ మార్పులు కేవలం చదువులోనే కాదు, భావోద్వేగాల్లోనూ కనిపిస్తాయి. పిల్లలు తమను ఇతరులతో పోల్చుకోవ డం మొదలుపెడతారు. ‘అతను ఇలా ఉన్నాడు, నేను ఎందుకు కాదు?; ఆమెకి అంత అటెన్షన్ ఉంది, నాకు ఎందుకు లేదు?’ అనే ఆలోచనలు మెల్లగా వారి మనసులోకి ప్రవేశిస్తాయి. బయటకు వాళ్లు నవ్వుతారు, కానీ లోపల తమను తాము తక్కువగా భావించడం మొదలుపెడతారు. ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, ఆం దోళన పెరుగుతుంది,

ఒంటరితనం పెరుగుతుంది. పిల్లలు వీటిని చూసి అనుక రిస్తారు. వారిలో ‘ఇది తప్పు’ అనే ఫిల్టర్ ఇంకా అభివృద్ధి కాలేదు కాబట్టి, వారు చూసిన ప్రవర్తనను సాధారణంగా భావిస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ఆత్మగౌర వం, పరిమితుల సమస్యలు, సంబంధాల్లో గందరగోళం పెరుగుతుంది. ఒక పిల్లవా డు ఈరోజు అనుకరిస్తున్నది, రేపు అతని వ్యక్తిత్వంగా మారే ప్రమాదం ఉంది. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ మనం ఏమి చేయకపోతే అసలే ఆగదు.

ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది. తల్లిదండ్రులు రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే పిల్లలతో మాట్లాడగలుగుతారు. కానీ, అల్గోరిథమ్ గంటల తరబడి పిల్లల తో మాట్లాడుతోంది. ఈ పోటీలో ఎవరు గెలుస్తారు? ప్రేమ ఉన్నా, పర్యవేక్షణ లేకపోతే అది సరిపోదు. మనం పిల్లలకు ఫోన్ ఇస్తున్నాం, కానీ డిజిటల్ ప్రపంచంలో ఎలా నడవాలో నేర్పడం మర్చిపోతు న్నాం. పిల్లలు చెడిపోలేదు; వాళ్లు మార్గదర్శనం లేకుండా ఉన్నారు. వారికి అవగా హన అవసరం. ఇది చూడొద్దని చెప్పడం కంటే ఇది ఎందుకు ఆకర్షిస్తోంది? అని అడగడం అవసరం. భయపెట్టడం కాదు, అర్థం చేయించడం ముఖ్యం. కుటుంబం లో సమయం, సంభాషణ, భావోద్వేగ బంధం ఇవే అసలు రక్షణ.

ఇది ఒక కుటుంబ సమస్య కాదు, సమాజం సమస్య. విద్యావ్యవస్థ, పాలసీ, టెక్నాలజీ కంపెనీలు అందరూ బాధ్యత తీసుకోవాలి. పాఠశాలల్లో డిజిటల్ అక్షరాస్యత, భావోద్వేగ విద్య, గౌరవం, హద్దులపై అవగాహన అవసరం. పాలసీ స్థాయిలో కంటెంట్ నియంత్రణ, వయ స్సు ధ్రువీకరణ, పిల్లల రక్షణకు కఠిన చర్య లు అవస రం. లేకపోతే ఇది మానసిక సం క్షోభంగా మారుతుంది. చివరికి ఒకే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి.

ఇక్కడ అసలు సమస్య పిల్లలు కాదు; నియంత్రణ లేని డిజిటల్ ప్రపంచం, మార్గదర్శనం లేని పిల్లలు, బాధ్యత మర్చిపోయిన పెద్దలు. మనం ఇప్పుడు ఏం చేస్తామో, అదే రేపటి సమా జం అవుతుంది. కాబట్టి ఒక్కసారి మనం మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన పిల్లల చేతిలో ఉన్నది ఫోన్ మాత్రమేనా? లేక వారి భవిష్యత్తా? స్క్రీన్ టైమ్ గురించి కాదు, రీల్ టైమ్ గురించి ఆలోచించాలి. వారు ఎంతసేపు ఫోన్‌లో ఉన్నా రో కాదు, వారు ఏమి చూస్తున్నారన్నది చూడాలి. ఇప్పుడే మేల్కొనాలి. లేకపోతే మనమే ఒక మానసిక సంక్షోభ తరాన్ని నిర్మించినవారమవుతాం.

 వ్యాసకర్త: కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్