18-12-2025 11:36:51 AM
హైదరాబాద్: తీరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ పోస్టర్ కలకలం రేపింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట తమిళ భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శ్రీవారి ఆలయం ఎదుట అన్నాడీఎంకే పోస్టర్లు ప్రదర్శిస్తూ వీడియో తీసుకున్నారు. తమిళనాడు భక్తుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తిరుమల కొండపై రాజకీయ ప్రచారాలపై నిషేధం ఉన్నప్పటికి, తమిళనాడు భక్తులు టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా అన్నాడీఎంకే పోస్టర్ ప్రదర్శినను టీటీడీ అధికారులు ఖండించారు. పోస్టర్ ప్రదర్శించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.