రాజకీయ ‘రామ’కీర్తన!
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల కొత్తరాగం
రాముడి పేరుతో ఓట్ల వేట మొదలు
శ్రీరాముడి పేటెంట్ తమదేనంటున్న బీజేపీ
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): రాజకీయ పార్టీలు కొత్త రాగాన్ని ఆలపిస్తున్నాయి. నేతలంతా రామ సంకీర్తనలు పాడుతున్నారు. ఒక నేత తన పేరులోనే రాముడున్నాడంటే.. మరో నేత నేను కూడా రామ భక్తుడినే అని మెడలోని దేవుడి లాకెట్‌ను ఆధారంగా చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో రాముడి పేరుమీదే రాజకీయం నడుస్తున్నది. ఇంతకాలం బీజేపీ ఒక్కటే రాముడిని వాడుకోగా.. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కూడా అదే పని మొదలుపెట్టాయి. బీజేపీకంటే ఒక అడుగు ముందుకేసి తామే రాముడి వారసులమన్నట్టుగా ఈ పార్టీల నేతలు ప్రచారం చేసుకొంటున్నారు. వాళ్ల తీరుచూసి ప్రజలు విస్తుపోతున్నారు. అయోధ్యలో రామ మంది రం నిర్మాణం, ప్రాణపత్రిష్ఠ ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి చేరేలా బీజేపీ కార్యక్రమాలు రూపొందించి అమలు చేసింది. తెలంగాణలో శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికీ అందేలా చేసింది. ప్రజలు ఇంకా రామ మందిరం అంశం నుంచి బయటకు రాకపోవటంతో అనివార్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కూడా అటువైపు అడుగులు వేయవలసి వస్తున్నది. సభలు, సమావేశాలు, కార్యకర్తలతో చర్చల సందర్భంగా శ్రీరాముడి పేరును వాడుకొంటూ తాము కూడా రాముడి భక్తులమే అన్నట్టుగా సంకేతాలిస్తున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి కూడా వస్తున్నది. దీంతో ప్రజలను భక్తితో ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో పార్టీలు, అభ్యర్థులు రామనామ స్మరణ మరింతగా పెంచుతున్నాయి. మున్ముందు ఈ ప్రచారం మరింత పెరిగే అవకాశం ఉన్నది.
భద్రాచలం రాముని పేరుతో గెలిచాం.
రాముని పరువు తీసిన తెల్లం వెంకట్రావుకు ప్రజల్లో తిరిగే హక్కు లేదు. రామునిపై నమ్మకంతో ప్రజాసేవ చేయాలి.7న భద్రాచలంలో ఎమ్మెల్సీ తాతా మధునా పేరులోనే రాముడు ఉన్నాడు. మాకు రాముడితో పంచాయితీలేదు. బీజేపీతోనే పంచాయితీ. రాముడు బీజేపీ వ్యక్తి కాదు.. ఆయన అందరి దేవుడు.
మల్కాజిగిరి సమావేశంలో కేటీఆర్
బండి సంజయ్.. రాముడి ఫొటోపై కాకుండా ఐదేండ్లలో ఏం చేశావో చెప్పి ఓట్లడగాలి. మేము రాముడి భక్తులమే. 17న శ్రీరాముడి పూజలు చేయమా?
కొండగట్టులో మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ రాముడి గుడి కట్టిస్తే.. వారికంటే ముందే మేము యాదాద్రిలో నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించి.. నిజమైన హిందువులమని నిరూపించుకున్నాం’ మెదక్ సమావేశంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు






