17 May, 2026 | 1:20 AM

ఓబీసీల పేరుతో రాజకీయ దొంగాట

17-05-2026 12:00 AM

పాపని నాగరాజు :

* ఓబీసీలు ఇకపై తమ ఓటును ఉచితంగా అప్పగించే పరిస్థితి నుంచి బయటకురావాలి. ఓటును రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలి. నినాదాలు కాదు, గణాంకాధారిత న్యాయం కోరాలి. ప్రకటనలు కాదు, రాజ్యాంగబద్ధమైన ప్రాతినిధ్య హక్కులను డిమాండ్ చేయాలి. 

మన దేశంలో ఓబీసీలు (-ఇతర వె నుకబడిన వర్గాలు) అతిపెద్ద బహుజన సామాజిక వర్గం. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఈ వర్గానిది. అయినప్పటికీ, మన దేశ రాజకీయ వ్యవస్థలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్న వ ర్గంగా ఓబీసీలు అనాదిగా మారిపోయారు. ఎన్నికల ముందు ప్రతి పార్టీ ‘మేమే ఓబీసీల రక్షకులం’ అని ప్రకటిస్తుంది. కానీ, ఎన్నికలు ముగిసిన తర్వాత వారి హక్కులు మళ్లీ న్యా యస్థానాల గడపల వద్ద, కమిటీల ఫైళ్లలో, పాలకవర్గాల రాజకీయ ఎత్తుగడల మధ్య చిక్కుకుపోతాయి. మొన్న తెలంగాణ, నిన్న మధ్యప్రదేశ్ వంతు అవుతుంది. మధ్యప్రదేశ్‌లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్ వివాదం ఈ రాజకీయ వాస్తవాన్ని మరోసారి బహిర్గతం చేసింది.

 మధ్యప్రదేశ్‌లో 2019లో ఓబీసీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచారు. దీనివల్ల మొత్తం రిజర్వేషన్లు 63 శాతానికి చేరాయి. ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన సాధారణ 50 శాతం పరిమితిని దా టింది. రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సామాజిక న్యాయ విజయంగా ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ ప్రభు త్వం దానిని న్యాయస్థానంలో నిలబెట్టే స్థా యిలో చట్టపరమైన, గణాంకపరమైన సన్నద్ధత చూపించాయా? అన్నదే ఇప్పుడు అస లు ప్రశ్న.

రిజర్వేషన్ల అంశంలో గణాంకాలు, సామాజిక (వివక్ష అంశా లు చట్టపరమైన పునాది. కానీ, కచ్చితమైన సమగ్ర కులగణన లేకుండానే రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోవడం, తర్వాత కోర్టు లో విస్తృత జనాభా గణాంకాలను చూపి స్తూ, దానిని సమర్థించడానికి ప్రయత్నించడం ప్రభుత్వ డేటా నిర్వహణలో ఉన్న గందరగోళాన్ని బయటపెడుతోంది. ఇది సాధారణ పరిపాలనా అలక్ష్యం మాత్రమే కాదు; బహుజనుల హక్కుల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం.

ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటాలంటే అసాధారణ పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టంగా నిరూపించాలి. అలాగే ఎం నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన తీర్పు ప్రకారం పరిమాణాత్మక గణాంకాలు, తగిన ఆధారాలు అవసరం. కానీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రమాణాలను పూర్తిస్థాయిలో సమర్థించే బలమైన వివరణను కోర్టు ముం దు ఉంచడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇది న్యాయపరమైన వైఫల్యం మా త్రమే కాదు; ఇతర వెనుకబడిన వర్గాల హ క్కులను అమలు దశలోనే బలహీనపరిచే వ్యూహాత్మక నిర్లక్ష్యం.

2019 నుంచి కొనసాగుతున్న ఈ కేసు ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారానికి నోచుకోకపోవడం ఆందోళనకరం. విచారణలు వా యిదా పడుతుండటం, డిజిటల్ రికార్డులు, సాంకేతిక ప్రక్రియలు వంటి కారణాలతో కాలయాపన సాగుతుండటం వల్ల ఓబీసీ యువతకు అందాల్సిన విద్య, ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతున్నాయి. ఇది కేవలం న్యాయ ప్రక్రియలో జాప్యం కాదు; బహుజనుల ప్రాతినిధ్య హక్కులను కాలరాసే నిర్మా ణాత్మక ఆలస్యం.

ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు. ఇది బహుజన హక్కులను నిర్వీర్యం చేసే (అగ్రవర్ణ భూస్వామ్య అనుకూల వర్గాలకు వం తపాడే) పాలకవర్గ కుట్రపూరిత నిర్లక్ష్యం. రిజర్వేషన్లను ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించడం, కోర్టులో వాటిని నిలబెట్టేందుకు తగిన బలమైన వాదనలు సమ ర్పించడంలో బలహీనంగా ఉండటం, అస లు కోర్టులో వాదించాడనికి న్యాయవాదినే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నియమించలేని నిర్లక్ష్యం చూస్తుంటే ఇది ఓటు బ్యాంకు రాజకీయమేనని స్పష్టంగా చెప్పవచ్చు.

ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తించాలి. ఈ సమస్యను కేవలం ఒకే పార్టీకి పరిమితం చేయలేం. మధ్యప్రదేశ్‌లో ఈ ప్రక్రియ ప్రా రంభం కాంగ్రెస్ పాలనలో మొదలై, బీజేపీ పాలనలో కూడా కొనసాగుతోంది. తెలంగాణలో కూడా బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీ య ప్రకటనలు, గవర్నర్, రాష్ట్రపతి స్థాయి రాజ్యాంగ ప్రక్రియల మధ్య చిక్కుకుపోయిం ది. ఈ చిక్కులకు ప్రధాన కారణం బీజేపీ అ యితే, మరో అంతుకు కాంగ్రెస్ పార్టీ కూడా కారణం అయ్యింది. అంటే బహుజనుల హక్కులను ఎన్నికల రాజకీయాల కోసం వినియోగించుకోవడం భారత రాజకీయా ల్లో అన్ని ప్రధాన త్రివర్ణ, త్రి శూ ద్ర పార్టీల్లో కనిపించే ధోరణి.

బీజేపీ ఒకవైపు ఓబీసీ మిత్రుడిగా తనను తాను ప్రదర్శించుకుంటూ, మరోవైపు ఈ కీలక అంశాల్లో న్యాయపరమైన స్పష్టత, గణాంకపరమైన కచ్చితత్వం చూపించడంలో విఫలమవుతోంది. ఇదే రాజకీయ అవకాశవాదం.

అయితే, బహుజన సమాజం ఇప్పుడు ఒక కీలకమైన సత్యాన్ని గ్రహించాలి. ఈ దేశంలో హక్కులు ఎవ్వరూ దయగా ఇవ్వ రు. వాటిని పోరాడి సాధించుకోవాల్సిందే. మండల్ కమిషన్ అమలు కూడా ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమైంది. అలాగే జనాభా ఆధారిత పూర్తి రిజర్వేషన్లు, సమగ్ర కులగణన, నిజమైన ప్రాతినిధ్య న్యాయం కూడా సంఘటిత రాజకీయ పోరాటం, ఒత్తిడి ద్వారానే సాధ్యమవుతుంది.

ఓబీసీలు ఇకపై తమ ఓటును ఉచితంగా అప్పగించే పరిస్థితి నుంచి బయటకు రావా లి. తమ ఓటును రాజకీయ ఆయుధంగా మలుచుకోవాలి. నినాదాలు కాదు, గణాంకాధారిత న్యాయం కోరాలి. ప్రకటనలు కాదు, రాజ్యాంగబద్ధమైన ప్రాతినిధ్య హక్కులను డిమాండ్ చేయాలి. బహుజనుల విముక్తి కేవలం రిజర్వేషన్ అమలులోనే కాదు; రాజ్యాధికారంలో బహుజన భాగస్వామ్యం సాధించినప్పుడే సామాజిక ప్రజా స్వామ్యం సాకారమవుతుంది.

‘బీసీల ఓటు.. పార్టీల వేటు!’ అనే ఈ రోజు పరిస్థితి శాశ్వతం కాదు. బహుజన సా మాజిక చైతన్యం రాజకీయ శక్తిగా మారినప్పుడే ఈ వంచన నుంచి విముక్తి లభిస్తుంది. అప్పు డు ఈ నినాదం బీసీల ఓటు.. రాజ్యాధికారానికి బాటగా మారుతుంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న 27 శాతం రిజర్వేషన్ల వివాదం మనకు ఒక స్పష్టమైన పాఠం చెబుతోంది. బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, బహుజన హ క్కులను అమలు దశలోనే నీరుగార్చడం భా రత పాలకవర్గ రాజకీయాల అసలు స్వరూ పం. దీనిని ఎదుర్కొనగల శక్తి సంఘటిత బహుజన చైతన్యమే.

 వ్యాసకర్త: సత్యశోధక మహాసభప్రతినిధి