calender_icon.png 1 August, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీటెక్కనున్న రాజకీయం

31-07-2025 12:00:00 AM

- కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దూకుడు

- ఆగస్టులో మీనాక్షి నటరాజ్ పర్యటన

- 4న చొప్పదండిలో పాదయాత్ర.. 5న సమావేశం

కరీంనగర్, జూలై 29 (విజయ క్రాంతి): కరీంనగర్ వేదిక గా రాష్ట రాజకీయాలు హీ టెక్కనున్నాయి. అధికార కాంగ్రెస్ బి సి రిజర్వేషన్లు సంక్షేమ పథకాలు ఎజెండా గా ముంసుకు పోవాలని నిర్ణయించి రంగంలో కి మీనాక్షి నటరాజన్ ను దించగా బి ఆర్ ఎస్ కరీంనగర్ లో బి సి గర్జన నిర్వహించాలని నిర్ణయించింది.అధికార కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయిం ది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పా ర్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతోపాటు నేతలను సమన్వయం చేయ డంపై దృష్టిసారించింది.

నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలను తొలగించి పార్టీ పటిష్టత కోసం కలిసివచ్చేలా సమన్వయం చేసేం దుకు కార్యాచరణను రూపొందించింది. ఈ మేరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ ఆరుని యోజకవర్గాల్లో మీనాక్షి నాటరాజన్ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకో వడం, ప్రభుత్వ పథకాల అమలు పరిశీలించనున్నారు. జూలై 31 నుంచి ఏడు రోజుల పాటు జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని చొప్పదండిని యోజకవర్గంలో ఆగస్టు 4న సాయంత్రం 10 కిలోమీటర్లు పాదయాత్ర చే యనున్నారు. రాత్రి ఇక్కడే బసచేసి 5న ప్రజలతో సమావేశం కానున్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంగళవారం పా ర్టీ నాయకులతో సమీక్ష నిర్వహించి పాదయాత్ర విజయవంతం కోసం దిశానిర్దేశం చేశారు. పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందు కు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ లోని అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. ఈ పాదయాత్ర విజయవంతానికి ఏఐసీసీ సమన్వయకర్తలను నియమించింది. ఇందులో వైఎస్సార్ పాదయాత్రలో పాల్గొ న్న రామగుండు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రా జ్ ఠాకూర్ ఉన్నారు.

రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది. కుల గణన అంశాన్ని కూడా అనుకున్నంతగా క్షేత్రస్థాయిలోకి నాయకులు, కార్యకర్తలు తీసుకువెళ్లలేదనే విమర్శ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలతో నేరుగా సంభాషించే అవకాశం ఉన్న పాదయాత్ర దోహ దం చేస్తుందని భావించి పాదయాత్ర చేపట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాదయాత్ర నిర్వహించిన ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచాలని భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఐక్యత, ఉత్సాహం పెంచేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని నేతలు భావిస్తున్నారు.

8న కరీంనగర్‌లో బీఆర్‌ఎస్ బీసీగర్జన

----స్థానిక సంస్థలతోపాటు విద్య,,ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ తో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగసభ నిర్వహించనున్నారు. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన త ర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయనున్నారు. కరీంనగర్ సభద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళతామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.. బీసీ రిజర్వేషన్ల అంశంపై త్వరలో బీఆర్‌ఎస్ బీసీ ప్రతినిధులం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామనితెలిపారు.