30-07-2025 11:19:10 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాంను ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas), ప్యాక్స్ చైర్మన్, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు వెచ్చించి అభివృద్ధి కోసం సహకరిస్తామన్నారు. అనంతరం ఏనుగు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, సహకార సంఘాలు రైతుల పక్షాన పని చేస్తాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకార సంఘాల ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి గోదాములను ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు.
సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. శాతరాజుపల్లి, వట్టెంల, చెక్కపల్లి వేములవాడ, నూకలమర్రి గ్రామాలలో గోదాములను పూర్తి చేసుకొని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోదామును ప్రారంభోత్సవం చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి. సొసైటీ డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.