24 June, 2026 | 2:31 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

నేడు బెంగాల్, తమిళనాడులో పోలింగ్

23-04-2026 12:00 AM
  1. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
  2. తమిళనాడులో ఒకే విడత
  3. బెంగాల్‌లో మొదటి విడత పోలింగ్.. 29న రెండో విడత

చెన్నై, కోల్‌కతా, ఏప్రిల్ ౨౨: పశ్చిమ బెంగాల్, తమిళనాడులో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే ఎన్నికల సామగ్రి తీసుకుని తమకు పోలింగ్ కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు.

తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ 4,023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్, ఏఐఏడీఎంకే నేతత్వంలోని ఎన్డీయే కూటమి మధ్య ద్విముఖ పోరు నెలకొంది.

పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు గాను రెండు విడతల్లో పోలింగ్ జరుగనుంది. రేపు జరిగే మొదటి విడతలో 152 స్థానాలకు ఓటింగ్ జరుగనుంది. మిగిలిన 142 స్థానాలకు ఈనె 29న పోలింగ్ జరుగుతుంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరు సాగుతున్నది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ మే 4న విడుదల కానున్నాయి.