14వేల మందికి అమెజాన్ ఉద్వాసన?
మే నెలలో తొలగింపులు?
న్యూయార్క్, ఏప్రిల్ 8 : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎతు న ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో భయం మొదలైంది. వచ్చే నెల దాదా పు 14వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆసియా బిజినెస్ అవుట్‌లుక్ వెల్లడించింది. మానవ వనరుల విభాగాలలోని ఉద్యోగులపై ప్రభావం పడనుందని నివేదికలు తెలిపాయి.
ఈ విషయంలో అమెజాన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2025 చివరి నాటికి అమెజాన్ 14వేల మంది ఉద్యోగులను తొలగించగా, ఈ ఏడాది జనవరిలో 16 వేల మం దిని తొలగించింది. మొత్తం నాలుగు నెలల వ్యవధిలో అమెజాన్ 30వేల మందిని తొలగించింది. అయినా ఉద్యోగాల కోత ఆపకపో వడం గమనార్హం.
రెండు నెలలు గడవక ముందే రోబోటిక్ టీమ్ మొత్తాన్ని తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో అమెరిజాన్ భారీ పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించింది. ఏఐ రాకతో కొన్ని రకాల ఉద్యోగాల అవసరం తగ్గుతుందని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ గతంలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.




