పోలింగ్ సజావుగా కొనసాగేలా చూడాలి
జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి శశాంక
రంగారెడ్డి, మే 10 (విజయక్రాంతి) : 13న నిర్వహించే పార్లమె ంట్ ఎన్నికలకు సంబంధించి పోలిం గ్ ప్రక్రియను సజావుగా కొనసాగేలా సెక్టోరల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం రాజేంద్రనగర్ టీఎస్‌ఐఆర్‌డీలో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించిన ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ ఇచ్చా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధు లు, పరిశీలించాల్సిన విషయాలపై వారికి అవగాహన కల్పించారు.
పోలింగ్ ప్రక్రియలో ఎక్కడ ఎలాం టి అవంతరాలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ శాతాన్ని వెను వెంట నే ఎన్‌కోర్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. వేసవి నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బం దులు కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.






