25 April, 2026 | 10:02 PM

ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

11-05-2024 02:26 AM

మెదక్, మే 10 (విజయక్రాంతి) : సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం మెదక్ ప్రభుత్వ బాలు ర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని సరిచూసుకొని పంపిణీ చేయాలన్నారు. పోలిం గ్‌కు ఒకరోజ ముందు సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఆర్వో, మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్లు శ్రీనివాస్, నారాయణ, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 

అభ్యుదయవాది బసవేశ్వరుడు

సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడని కలెక్టర్ రాహుల్‌రాజ్ కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతి నిర్వహించా రు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి మంగ నాగరాజుగౌడ్, కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, భానుప్రకాశ్, సిద్ధిరాములు, వసతి గృహ సంక్షేమ అధికారులు సుధాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, నవీన్, ఉమ పాల్గొన్నారు.