20 March, 2026 | 6:15 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయన వినాయకులతో చెరువులు కలుషితం

04-09-2024 03:42 PM

మట్టి వినాయక విగ్రహాలే మేలు : జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్

జగిత్యాల,(విజయక్రాంతి): ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలతో చెరువులలో నీరు కలుషితమై పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. దీంతో మట్టి వినాయకులను ఉపయోగించి చెరువులను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పిలుపు ఇచ్చారు. ఇందుకు సంబందించిన పోస్టర్లను జిల్లా కలెక్టరేట్లో బుధవారం ఆవిష్కరించి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పోస్టర్ల కలెక్టర్ ప్రదర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ... వినాయక చవితి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రతి ఏటా గణేష్ చతుర్థికి మట్టివినాయక విగ్రహలను ఉపయోగించాలని ప్రతి జిల్లాకు పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో జగిత్యాల జిల్లాకు 2000 మట్టి వినాయకులను పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ, తెలంగాణ కాలుష్యం నియంత్రణ మండల తరపున కనకజ్యోతి,అసిస్టెంట్ సహాయ శాస్త్రవేత్త, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్, డిడబ్ల్యూఓ భోనగిరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.