27 March, 2026 | 9:44 PM

దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం

04-05-2024 01:37 AM

జహీరాబాద్, మే 3 : దేశాభివృద్ధి నరేంద్రమోదీతోనే సాధ్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఇన్‌ఛార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరిచి ప్రజల దృష్టిని మరల్చడానికి డ్రామాలు ఆడుతున్నదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు మారిందన్నారు. ప్రజలకు సేవ చేసే పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ అన్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి చైతన్య పర్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుధీర్‌బండారీ, జనార్దన్‌రెడ్డి, బక్కయ్యగుప్తా, శ్రీనివాస్ నాయుడు, విశ్వనాథ్, అశోక్‌బెల్కేరి, విశ్వనాథ్‌యాదవ్ పాల్గొన్నారు.