23 May, 2026 | 6:40 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

సీతారాముల పవిత్ర బంధం నేటి తరానికి ఆదర్శనీయం

27-03-2026 08:45 PM

మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చెర్మన్ తన్నీరు మల్లిఖార్జున్

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

హుజూర్ నగర్: లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీతారాముల పవిత్ర బంధం నేటి తరానికి ఆదర్శనీయమని హుజూర్ నగర్ మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చెర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పట్టణంలోని పలు వార్డులలో ముఖ్య అతిథులుగా పాల్గొని సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...  ప్రజలంతా శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు.

సామాజిక న్యాయం, ధర్మాన్ని ఆశ్రయించే పాలన ఎలా ఉండాలనే దానికి శ్రీరాముడు చూపించిన మార్గమే నిదర్శనమని గుర్తు చేస్తూ అందుకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాముని ధర్మాన్ని అనుసరిస్తూ అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.సీతారాముల కరుణాకటాక్షాలు ప్రజలపై ఉండాలని, పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా వెలుగొందేలా, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దేవతా మూర్తులను ప్రార్థించారు.