13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సెక్యూరిటీ జమేదర్ విజేందర్ ఘనంగా వీడ్కోలు

27-03-2026 08:42 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): సింగరేణి సత్తుపల్లి ఏరియా జలగం వెంగళరావు ఉపరితల గనిలో సెక్యూరిటీ జమేదర్ గా విధులు నిర్వర్తించి మణుగూరు జూనియర్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది శుక్రవారం బదిలీ అవుతున్న బందెల విజేందర్ ను శుక్రవారం జే.వి.యర్ "సి" రిలే ప్రవేట్ సెక్యూరిటీ గార్డ్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విజేందర్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది పట్ల వ్యవహరించిన తీరును జ్ఞప్తికి తెచ్చుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించే ప్రాంతాలలో వసతుల కల్పన, సిబ్బందికి సమస్యల పరిష్కారం పట్ల జమేదర్ విజేందర్ వ్యవహరించిన తీరును  ప్రైవేట్ సిబ్బంది ప్రశంసించారు. జూనియర్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందిన విజేందర్ మరిన్ని పదవులు అధిరోహించి ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఆకాంక్షించారు.