27 March, 2026 | 8:03 PM

7న కామారెడ్డికి కేసీఆర్

04-05-2024 01:38 AM

కామారెడ్డి, మే 3 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 7న కామారెడ్డిలో రోడ్ షో నిర్వహిస్తున్నట్టు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్ శుక్రవారం తెలిపారు. జేపీఎన్ చౌరస్తాలో రోడ్ షో అనంతరం సమావేశంలో కేసీఆర్ మాట్లాడతారని పేర్కొన్నారు. జిల్లాలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మండలస్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై రోడ్ షోను, సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.