27 March, 2026 | 11:35 PM

మత్తు పదార్థాల మైకంలో మైనర్లు!

04-05-2024 01:36 AM

నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్

నాగర్‌కర్నూల్, మే 3 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో చిన్న వయసు పిల్లలు సైతం సిగరెట్, మద్యం, గంజాయి, డ్రగ్స్‌కు  బానిసలుగా మారుతున్నారని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపైనే ఉన్నదని ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాడ్ ప్రాంగణంలో మత్తుపదార్థాల నిర్మూలన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదిహేనేండ్ల బాలురు చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని తమ పరిశీలనలో బయట పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని సరఫరా చేసే వ్యక్తులు, స్థావరాల వివరాలను పోలీసులకు తెలపాలని కోరారు. షీటీం, తదితర వేదికల ద్వారా పలు ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నామని గుర్తుచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ బుర్రి శ్రీనివాస్, సీఐ కనకయ్యగౌడ్, ఎస్సై గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.