24 August, 2026 | 3:11 AM

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కేంద్రం కృషి చేయాలి

24-08-2026 02:36 AM

కేసముద్రం, ఆగస్టు 23 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు, కార్మికుల గుర్తింపు, రెన్యువల్, 55 ఏళ్లు నిండిన కార్మికునికి సంక్షేమ బోర్డు నుండి పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడబోయిన శ్రీశైలం డిమాండ్ చేశారు.

పంజాబ్ రాష్ట్రంలోని పటాన్ కోట్ లో నిర్వహిస్తున్న బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ కార్యక్రమాల్లో జరుగుతున్న జాప్యం, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు వెల్ఫేర్ బోర్డు కమిటీలను ఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.