14 July, 2026 | 3:57 PM

Breaking News

తెలంగాణలో SIR గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాం: మంత్రి పొన్నం   •   మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •  

పీఆర్‌టీయూటీఎస్ జిల్లా నూతన అధ్యక్షుడిగా పూనేం నరసయ్య

23-06-2025 01:26 AM

మోసాలను సహించేది లేదు ... ప్రధాన కార్యదర్శి ప్రభాకర్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ  పి ఆర్ టి యు టి ఎస్ నూతన కమిటీ అధ్యక్షులుగా పూనేం నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ లను నియమిస్తూ రాష్ట్ర పి ఆర్ టి యు టీఎస్ అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.

ఆదివారం జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పూనేం నరసయ్య మాట్లాడుతూ తేదీ ఈనెల 14 న పాల్వంచ పట్టణ టిటిడి కళ్యాణ మండపంలో జరిగినటువంటి సమావేశంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి,అడ్ హక్ పద్ధతిలో జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించడం జరిగినదన్నారు.

19న అడ్ హక్ పద్ధతిలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా భుక్య భాస్కర్, తేజావత్ రవీందర్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా కళావతి నియమించడం జరిగిందనీ తెలిపారు. పి ఆర్ టి యు టి ఎస్ కు మరో అనుబంధ సంస్థలు గాని సంఘాలు గాని లేవని ప్రకటించారు. గతంలో సస్పెండ్ కు గురి అయిన డి వెంకటేశ్వర్లు తనకు తాను జిల్లా అధ్యక్షునిగా ప్రకటించుకోవడానికి సరికాదన్నారు.

సంఘాన్ని అడ్డుపెట్టుకొని జిల్లా కేంద్రముగాను పి ఆర్ టి యు టీఎస్ భవన నిర్మాణానికి రూ 5000 నుండి రూ 2లక్షల వరకు వసూలు చేశారని, హౌసింగ్ సొసైటీ పేరుతో రూ 1500 చొప్పున 750 మంది ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు.

ఇటువంటి మోసాలకు పాల్పడిన వ్యక్తికి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్న రవి మద్దతు తెలపడం సరికాదంటూ రాష్ట్ర కమిటీ అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగినధని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ వారు చేసుకున్నటువంటి ప్రకటన పై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు భాస్కర్ రావు,రవీందర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కళావతి రాష్ట్ర కార్యదర్శి చందు, మోహన్ జిల్లా ఉపాధ్యక్షులు రామారావు, మండల బాధ్యులు,రమేష్, శ్రీకాంత్, శ్రీ రాములు, రమేష్ బాబు, అరుణ,ఉమా, రాముడు తదితరులు పాల్గొన్నారు.