14 July, 2026 | 4:43 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

అర్హులైన పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

23-06-2025 01:28 AM
  1. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  2. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి

ఖమ్మం, జూన్ 22 ( విజయ క్రాంతి):అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవె న్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధా ల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆదివారం మంత్రివర్యు లు, ఏదులాపురం మునిసిపల్ పరిధిలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఏదులాపురం మున్సిపల్ ప్రాంతం నాయుడుపేట జంక్షన్ వద్ద 4 కోట్ల రూపాయలతో ఖమ్మం - మహబూబాబాద్ నాలుగు లైన్ల రహదారి విస్తరణ పను లకు, పెద్దతండ గ్రామంలో ఖమ్మం - సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి శ్రీ యోగా నంద సాయి ఆశ్రమం చల్లపల్లి గార్డెన్ వరకు కోటీ 50 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గుదిమల్ల వాటర్ ట్యాంక్ నుండి బోడగుట్ట డొంక వరకు కోటి 21 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నామని అన్నారు. పేద లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృ ద్ధి చేపట్టామని అన్నారు. అర్హులైన పేద లం దరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు.

రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. ఏ దులాపురం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తు న్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ. యాకోబ్, ఇఇ వి. యుగంధర్, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, ఏదులా పురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

ఖమ్మం, జూన్ 22 ( విజయ క్రాంతి):అర్హులైన పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవె న్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధా ల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.ఆదివారం మంత్రివ ర్యులు, ఏదులాపురం మునిసిపల్ పరిధిలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఏదులాపురం మున్సిపల్ ప్రాంతం నాయుడుపేట జంక్షన్ వద్ద 4 కో ట్ల రూపాయలతో ఖమ్మం - మహబూబాబాద్ నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులకు, పెద్దతండ గ్రామంలో ఖమ్మం - సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి శ్రీ యోగానంద సాయి ఆశ్రమం చల్లపల్లి గార్డెన్ వరకు కోటీ 50 లక్షలతో నిర్మించను న్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గుదిమల్ల వాటర్ ట్యాంక్ నుండి బోడగుట్ట డొంక వరకు కోటి 21 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నామని అన్నారు. పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేపట్టామని అన్నారు. అర్హులైన పేదలందరికీ తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు అందించే బాధ్యత తాను తీసుకుంటున్నానని అన్నారు. రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు.

ఏదులాపురం ము న్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్.ఈ. యాకోబ్, ఇఇ వి. యుగంధర్, ఖమ్మం ఆర్డీ ఓ నరసింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమీషనర్ ఏ. శ్రీనివాస్ రెడ్డి, పంచా యతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.