ఈవీవీ సినిమాలా పాపం ప్రతాప్
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్‌పీ దుర్గ నరేశ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, రఘుబాబు, గోపరాజు రమణ, దేవిప్రసాద్, రవి ఆంథోనీ, ప్రసాద్ బెహరా, అనంత బాబు, బాషా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరో అల్లరి నరేశ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. “లిటిల్ హార్ట్స్, ‘రాజు వెడ్స్ రాంబాయి’లా ‘పాపం ప్రతాప్’ కూడా పెద్ద సక్సెస్ కావాలి. కామెడీ సినిమాలు తగ్గుతున్నాయి. తప్పకుండా కామెడీ ఎంటర్‌టైనర్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ.. “పాపం ప్రతాప్’.. ఈవీవీ సినిమాలా అనిపిస్తుంది” అని చెప్పారు.
డైరెక్టర్ దుర్గా నరేశ్ మాట్లాడుతూ.. “బయట చెప్పుకోలేక లోపల బాధపడుతున్న ప్రతి మగాడికి ఈ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుంది. బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి ఈ సినిమా మామూలుగా ఉండదు. ‘పాపం ప్రతాప్’ నాకు మరిన్ని అవకాశాలు తెస్తుందని నమ్ముతున్నా” అని తెలిపారు. ‘ప్రేక్షకులు పెట్టిన డబ్బులకు రెట్టింపు వినోదం ఉంటుంద’ని నిర్మాత రాకేశ్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీవీఎస్ రవి, దశరథ్, సాయిలు కంపాటి, మూవీ యూనిట్ అంతా మాట్లాడారు.




