12 April, 2026 | 2:04 AM

కొణిదెల వారి మేనల్లుడి కోడె మొక్కులు!

12-04-2026 12:00 AM

ఎములాడ రాజన్నను, కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు హీరో సాయిదుర్గతేజ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఆయన పూజలు చేశా రు. రాజన్న అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామిని సైతం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించి, కోడె మొ క్కులు చెల్లించుకున్నారు.

అనంతరం సాయిదుర్గతేజ్ కొండగట్టు అంజన్నను సై తం దర్శించుకున్నారు. తాను నటించిన ‘సంబరాల యేటిగట్టు’ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారికి మొ క్కులు చెల్లించుకున్నట్టు తెలిపారు సాయిదుర్గతేజ్. వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేశారు.