calender_icon.png 30 May, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలు' పోస్టర్ ఆవిష్కరణ

28-05-2025 08:31:36 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(Telangana Journalist Forum) రాజతోత్సవ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలార్జున్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమన్నారు.

దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఈ నెల 31న జలవిహార్ లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు కామారెడ్డి జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణలో టియుడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షులు ఒడ్డెమ్ భాస్కర్, టియుడబ్ల్యూజే, టెంజు అధ్యక్షులు మంత్రి అంజి, దశాగౌడ్, అంజల్ రెడ్డి, రాములు, రామచంద్రం, నాగరాజు, కిషన్, విశాల్, భరత్ గౌడ్, హరీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.