calender_icon.png 30 May, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు..

28-05-2025 08:36:53 PM

రికార్డ్స్ పత్తి గింజలు పరిశీలిస్తున్న ఎస్ఐ కృష్ణారెడ్డి..

మునుగోడు/మర్రిగూడ (విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పని స్థానిక ఎస్ఐ కృష్ణారెడ్డి(SI Krishna Reddy) సిబ్బందితో డీలర్లను హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ను సందర్శించారు. పత్తి గింజలు నమోదు రికార్డులను పరిశీలించి పత్తి విత్తనముల రాకెట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఫర్టిలైజర్స్ డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనములను అందించాలని సూచించారు. రైతులు లైసెన్సు కలిగిన ఫర్టిలైజర్స్ దుకాణంలోనే విత్తనములను కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనంలకు ఎరువులకు పురుగు మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సైదులు కోటేసు ఉన్నారు.