calender_icon.png 30 May, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సేవలు అందించాలి..

28-05-2025 08:25:26 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..

హనుమకొండ (విజయక్రాంతి): బుధవారం హనుమకొండ జిల్లా మడికొండ శివారులోని దుర్గభాయి మహిళా శిశు వికాస కేంద్రం ప్రాంగణంలో జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య(District Collector P. Pravinya) జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఏదైనా విపత్తులు, ఆపద సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడేలా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వైద్య, ఆరోగ్య, మత్స్య, అగ్నిమాపక శాఖలను భాగస్వామ్యం చేస్తూ ఆ శాఖల అధికారులు సీపీఆర్ చేయడం, అగ్ని ప్రమాదాల నుండి కాపాడడం, వరదలు సంభవించినప్పుడు ఎలా రెస్క్యూ చేస్తారనే వివరాలను తెలియజేస్తారని అన్నారు. వాలంటరీలు తమ చుట్టుపక్కల సంభవించే విపత్తుల భారీ నుండి కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ... ఆపద మిత్ర వాలంటీర్లకు 12 రోజుల పాటు ప్రకృతి విపత్తు, ఆపద సమయాలలో ఏవిధంగా కాపాడవచ్చనే వివరాలను శిక్షణ కార్యక్రమం లో తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, మెప్మా కోర్డినేటర్ రజిత రాణి, మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ, ఆపద మిత్ర వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన..

బుధవారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ సమీపంలోని పాత ఆర్ అండ్ బి క్వార్టర్స్ భవన సముదాయం ఆవరణలో ప్రతిపాదిత 33/11 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుకు ఆర్ అండ్ బి, విద్యుత్, రెవెన్యూ అధికారులతో స్థల విస్తీర్ణం భవన వివరాలను ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబును అడిగి, స్థలానికి సంబంధించిన మ్యాపును హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్.ఈ మధుసూదన్, డిఈ సాంబరెడ్డి, రెవెన్యూ, విద్యుత్, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.