11 July, 2026 | 2:11 AM

సైబరాబాద్‌లో గుంతల మరమ్మతు పనులు ముమ్మరం

11-07-2026 12:20 AM

శేరిలింగంపల్లి, జూలై 10 (విజయక్రాంతి): వర్షాకాలం ముందు సైబరాబాద్లో రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయడానికి జోనల్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ అధికారులతో కలిసి మరమ్మతు పనులను స్వయంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ, వర్షాలు ప్రారంభమవడానికి ముందే రహదారులను సురక్షితంగా, గుంతలు లేని స్థితిలో తీర్చిదిద్దడమే మా లక్ష్యం. శాశ్వత పరిష్కారం కోసం వెట్ మిక్స్ షెల్మాక్ బ్యాగ్స్ మినీ టాండమ్ వైబ్రేటరీ రోలర్లను ఉపయోగించి నాణ్యమైన మరమ్మతులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలోని ముఖ్య రహదారులపై గుంతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, యంత్రాల సాయంతో నాణ్యత ఉన్న మెటీరియల్తో మరమ్మతులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు పడినా గుంతలు మళ్లీ ఏర్పడకుండా ఉంటాయని అధికారులు తెలిపారు. రహదారుల మరమ్మతు పనులు జరుగుతున్నందున ప్రయాణికులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, వేగం తగ్గించి ప్రయాణం చేయాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.