5 March, 2026 | 7:17 PM

కడు బీదరికం.. కరుణించువారు కరువు

18-10-2025 12:00 AM

ఖానాపూర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : దశాబ్దాల కాలంగా ఒక వికలాం గురాలు కడు బీదరికంతో పోరాటం చేస్తూ కరుణించు వారు లేక.. రోడ్డు పక్కన సందు గొందులలో తలదాచుకుంటూ... జీవనం సాగిస్తున్న వైనం ఇది.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో దొంతుల నర్సు అనే వికలాంగ మహిళ తన బ్రతుకు వెళ్ళదీస్తుంది. నా అన్న వారు లేక పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ పక్కన మసీదు ఎదురుగా ఒక చిన్న గోడ సందు లో ఇన్ని నాల్లు జీవనం సాగించింది.

రాత్రింబగళ్లు, ఎండా, చలి, వాన, అన్నిటికీ ఆ గోడనే ఆమెకు ఆధారం. నడుము నుంచి కిందికి పూర్తిగా చచ్చుబడిపోయిన కాళ్లు నడవడానికి కూడా అవకాశం లేక రోడ్డుపై కాళ్లతో దేకుతూ.. జీవనం సాగించే ఈ మహిళ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఉన్నతాధికారులే కానీ నాయకులనే వారికి కానీ కంటపడలేదంటే విడ్డూరం అనిపిస్తుంది. ఇటీవల ఒక దయాద్ర హృదయులు కాలేజ్ పక్కన గోడకు అనుకుని ఉన్న రేకుల టేలాలో ఆమె కు ఆశ్రయం కల్పించగా అక్కడే నివాసం ఉంటుంది.

కాగా ఈ దీనురాలికి ఇటీవల కాలం వరకు కూడా ప్రభుత్వ పెన్షన్ అందలేదంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటికీ ఆమెకు రేషన్ కార్డు లేదు. తోడ పుట్టిన వాడు వేరే పట్టణానికి ఇల్లరికం వెళ్లడంతో ఈమె చిన్నప్పుడే అనాథైంది. ఇరుగు పొరుగు జాలి మీద బ్రతికే ఈమె జీవనం కడు విచారం. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ బెడ్ రూమ్ సౌకర్యం కల్పించాలంటే ఈమె ఒంటరి మహిళ కావడం వల్ల ఇల్లు ఇవ్వలేమని అధికారులు, నాయకులు అం టున్నారని ఆమె విజయ క్రాంతి ప్రతినిధితో కన్నీళ్లు పెట్టుకుని గోడు వెళ్ళబోసుకుం ది.

దయగల వారు కనీసం ట్రై సైకిల్ వంటి సౌకర్యం మంచినీళ్ల సౌకర్యం కల్పస్తే  బాగుండేదని ఆమె వాపోయింది. ప్రస్తుతం ప్రధాన రోడ్డు పక్కనే ఉండటంతో రాత్రింబగళ్లు భయంతో బ్రతుకుతున్నానని అంటుం ది. ఇకనైనా రాజకీయ నాయకులు, స్వచ్ఛం ద సంస్థలు, ప్రజాసేవకులు తాము ప్రజాసేవ చేస్తున్నామని సోషల్ మీడియా, పత్రికలలో కనబడే వారు ఇలాంటి వారికి కనీస సహా యం చేయడానికి ముందుకు రావాలని, మానసికస్థిమితం కోల్పోయి వీధుల వెంబడి తిరుగుతున్న మరి కొంతమందిని పట్టించుకుని వైద్య సహాయం అందిస్తే వారి జీవనం ముందుకు సాగుతుందని పలువురు మేధావులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు.