24 August, 2026 | 11:42 AM

Breaking News

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •   హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి   •  

గోదావరి-బనకచర్లను అనుసంధానించాలని భావిస్తున్న ఏపీ

18-06-2025 06:50 PM

హైదరాబాద్: తెలంగాణ డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఎంపీల సమావేశం ప్రారంభమైంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఎంపీలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వం అధికారులు వెల్లడించారు. బనకచర్ల ద్వారా రోజుకు మూడు టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు వాడుకోనేందుకు ఏపీ ప్రణాళికలు చేస్తోందని, 7.41 లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రణాళికతో ఉన్నారని ప్రభుత్వం ఆరోపించింది.

బనకచర్ల రిజర్వాయర్ ప్రకాశం జిల్లాలో పెన్నా బేసిన్ లో ఉందని, గోదావరి జలాలను పెన్నా బేసిన్ లోకి తరలించి రాయలసీమకు నీరు ఇవ్వాలని ఏపీ భావిస్తోందని ప్రభుత్వం వెల్లడించింది. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్ లోకి తరిస్తున్నారని, బనకచర్ల ద్వారా మొదటి దశలో ప్రకాశం బరాజ్ కు, రెండో దశలో బొల్లాపల్లికి, మూడో దశలో బొల్లపల్లి నుంచి బనకచర్లకు తరలిస్తారని ప్రభుత్వం చెప్పింది. రూ.82 వేల కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమకు చాలా కీలకమైన రెగ్యులేటర్ అని తెలిపారు.