మళ్లీ బీజేపీదే అధికారం
ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు
ఇండియా కూటమికి తాజా సర్వేలో 185 సీట్లు
మళ్లీ ప్రథమ స్థానంలో మోదీనే..!
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తాజా మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్) సర్వే స్పష్టం చేసింది. గత సర్వేతో పోలిస్తే ఎన్డీయే బలంలో కొంత తగ్గుదల కనిపించింది.
తాజా అంచనాల ప్రకారం.. నేడే లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి 326 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జనవరిలో నిర్వహించిన గత సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో 26 సీట్లు తగ్గాయి. అయినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెరుగైన సీట్లను సాధిస్తుందని చెప్పింది. అయితే, ఎన్డీయే మద్దతు కొంత మేర క్షీణిస్తుందని సర్వే అంచాన వేసింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వం లోని ఇండియా కూటమి సీట్లలో పెద్దగా మార్పు కనిపించలేదు.
తాజా సర్వేలో ఇండియా కూటమికి 185 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. జనవరి 2026 ఎంఓటీఎన్ సర్వేలో ఈ సంఖ్య 182గా ఉంది. ఓట్ షేర్ ప్రకారం చూస్తే బీజేపీకి 39 శాతం, కాంగ్రెస్ కు 21 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే ఎన్డీఏ కూటమి బలం తగ్గుదల వెనుక నీట్ ఎగ్జామ్, రామ మందిర విరాళాల చోరీ, ఈ20 పెట్రోల్ తదితర కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇచ్చిన ‘400 పార్’ (400 దాటుతాం) నినాదానికి తాజా అంచనాలు దూరంగా ఉన్నప్పటికీ, ‘జెన్ జెడ్’ ఓటర్ల రూపంలో సవాళ్లు ఎదురవుతున్నా ఎన్డీఏపై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం విపక్ష ‘ఇండియా’ కూటమి సీట్లలో భారీగా పెరుగుదల ఏమీ కనిపించ లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ ప్రతిపక్ష కూటమికి ప్రస్తుతం 185 సీట్లు వచ్చే అవకా శం ఉందని తాజా సర్వే పేర్కొంది. ఇది గత జనవరి సర్వేలోని 182 సీట్లతో పోలిస్తే స్వల్పంగా 3 సీట్లు మాత్రమే ఎక్కువ. అయి తే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన 234 సీట్లతో పోలిస్తే ఇది భారీ తగ్గుదలే కావడం గమనార్హం.
ప్రథమ స్థానంలో మోదీనే..!
తాజాగా సీఓటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే నీట్ విషయంలో జెన్ జీ ఆం దోళన అనంతరం నిర్వహించడం విశేషం. జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య 25,184 మంది ప్రత్యక్ష అభిప్రాయాలను సేకరించా రు. దీనికి అదనంగా సీఓటర్ క్రమం తప్పకుండా నిర్వహిం చే ట్రాకర్ ద్వారా గడిచిన ఆరు నెలల్లో సేకరించిన 91,795 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించి ఈ అంచనాలను ఖ రారు చేశారు. ఈ అంచనాల్లో ప్రధానమం త్రి పదవికి అత్యంత తగిన వ్యక్తిగా మరోసారి మోదీనే ప్రథమ స్థానంలో నిలిచారు.






