28 August, 2026 | 4:21 AM

కూలిన శిక్షణ విమానం

28-08-2026 01:52 AM

ఇద్దరు పైలెట్లు మృతి

కాన్పూర్‌లో ఘటన 

లక్నో, ఆగస్టు 27: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని కాన్పూర్‌లో ఓ శిక్షణ విమానం కూలిపో యి ఇద్దరు పైలెట్లు మృతి చెందారు. గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో విమానం టేకాఫ్ కాగా 20 నిమిషాల తరువాత 11.50 గంటలకు గంగా బ్యారేజీ సమీపంలో ఐదు అడుగుల ఎత్తున గోడను ఢీకొని నాథ్‌పురా వద్ద పొలంలో కుప్పకూలి పేలిపోయింది.

దీంతో విమానంలో ఉన్న పైలెట్ సచిన్ భాటియా(గుజరాత్), కోపైలెట్ అభిషేక్ పూజారి(కర్ణాటక) ఇద్దరూ మృతి చెందారు. ఒక పైలెట్ కాక్‌పీట్‌లో చిక్కుకుపోయి మృతి చెందగా, మరో పైలెట్ రక్తపు మడుగులో విమానం నుంచి బయటపడ్డాక దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనపై కాన్పూర్ పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ మీడియాతో మాట్లాడుతూ.. చకేరిలోని గార్గ్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి విమానం బయలుదేరిన 20 నిమిషాలకు 39 కి.మీ. దూరంలో ఉన్న నాథ్‌పురా గ్రామంలో కూలిపోయిందని తెలిపారు. ప్ర మాదంపై డీజీసీఏకు సమాచారం అందించామని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై డీజీసీ ఏ అధికారులు మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగింది? అనేది దర్యాప్తులో తేలుతుందని, విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.