26 July, 2026 | 1:49 AM

ఆర్టీసీలో ఉత్తమ సేవలకు ‘ప్రగతి చక్ర’ అవార్డు

26-07-2026 12:00 AM

నాగోల్ బండ్లగూడ డిపో ఉద్యోగులకు సత్కారం 

ఎల్బీనగర్, జులై 25 : ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా బలోపేతానికి ఉత్తమ సేవలు అందిం చిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రగతి చక్ర అ వార్డులను ఆర్టీసీ యాజమాన్యం అందజేసి, సన్మానించారు. బండ్లగూడ డిపోలో జూన్ నెల కు సంబంధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డులు, నగదు పురస్కారం అందజేశారు.

అత్యధిక ఆదాయం తీసుకుని వచ్చిన కండక్టర్లు, ఇం ధన పొదుపు చేసిన డ్రైవర్లు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెకానికల్ సిబ్బందికి అవార్డులతోపాటు నగదు పురస్కారం అందజేశారు. అనంతర బండ్లగూడ డిపో 14వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులందరికీ డిపో మేనేజర్ రమేష్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, ఉద్యోగులు పాల్గొన్నారు.