3 July, 2026 | 5:02 AM

ప్రజ్ఞానంద శుభారంభం

29-05-2024 12:53 AM

స్టావెంజర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ప్రజ్ఞానంద ఫ్రాన్స్‌కు చెందిన అలీరెజా ఫిరౌజాను మట్టికరిపించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో నల్ల పావులతో బరిలోకి దిగిన ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లోనే అలీరెజాను చిత్తు చేశాడు. మన గ్రాండ్‌మాస్టర్‌కు ఫిరౌజాపై ఇదే తొలి విజయం. ఇటీవలే ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద అదే జోరు కొనసాగించాడు. మరోవైపు స్థానిక ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్.. డింగ్ లారెన్ (చైనా)తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ నకామురా తన సహచర ఆటగాడు ఫాబియానో కురానాపై విజయం సాధించాడు.