ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలి
ప్రజాదివాస్ కు 13 ఫిర్యాదులు
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజలు ఎటువంటి పైరవీలు, మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి నేరుగా 13 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాదివాస్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.






