మొయినాబాద్‌లో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ పరిశుభ్రత
23-05-2026 12:00 AM
మొయినాబాద్, మే 22(విజయక్రాంతి) ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి షాబాద్ సోనియా దర్శన్, కౌన్సిలర్ అప్పాల సంధ్యా సురేష్, సిబ్బంది మరియు గ్రామస్తులు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజలు కలిసి కాలనీలు, రహదారులు, మురుగు కాలువలను శుభ్రం చేసి అవగాహన కల్పించారు. చైర్పర్సన్ సోనియా దర్శన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని, ప్రజల భాగస్వామ్యంతోనేమున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దగలమని పిలుపునిచ్చారు. గ్రామస్తుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.






