ఆడపిల్లలతో ఆడుకుంటే ఊరుకునేది లేదు
యూట్యూబ్ ఛానల్‌పై నటి విష్ణుప్రియ ఫిర్యాదు
శేరిలింగంపల్లి, మే 22 (విజయక్రాంతి): సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న క్యారెక్టర్‌కు సంబంధిం చిన అశ్లీల వ్యాఖ్యలు, వీడియోలకు వ్యతిరేకంగా బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రి య భీమనేని న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న ‘ప్లే లైక్ ఇంకాగ్నిటో’ యూట్యూబ్ ఛాన్‌లపై శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా విష్ణుప్రియ విలేకరులతో మాట్లాడుతూ.. మానసిక వేదనకు గురయ్యానని, ఇక ఊరుకునేది లేదన్నారు. సెలబ్రిటీల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మహిళా కళాకారుల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సోషల్ మీడియాపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారని మియాపూర్ సీఐ తెలిపారు. విష్ణుప్రియ ఫిర్యాదుపై సినీ పరిశ్ర మ వర్గాల నుంచి పలువురి మద్దతు లభించింది.






