7 July, 2026 | 2:09 AM

ప్రజావాణి దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించాలి

07-07-2026 01:21 AM

కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్ జులై 6 (విజయక్రాంతి): ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని అధికారులు అత్యంత బాధ్యతగా స్వీకరించాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, చట్ట నిబంధనల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు ప్రధానంగా భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ పథకం, స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు.

ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలి

 జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ 12ను ఈనెల 31వరకు చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరిష్ సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం వివిధ శాఖల అధికారుల తో కలిసి ఆపరేషన్ ముస్కాన్ 12 పోస్టర్ ను ఆవిష్కరించారు. తప్పిపోయిన, పారిపోయిన పిల్లలతో పాటు బాలకార్మికులుగా మారిన వారిని సంరక్షించి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీవరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లలో పిల్లల మిస్సింగ్కు సంబంధించిన సమాచారం తీసుకుని అన్ని విభాగాలు సమన్వయంతో వారిని గుర్తించేందుకు చేర దీసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ఇటుక బట్టీలు, బేకరీ దుకా ణాలు, మెకానిక్ దుకాణాలు, ఇళ్ల నిర్మాణాల పనులు, వ్యవసాయ పనులతో పాటు ఇతర పనులల్లో బాలకార్మికులతో పనిచేయించుకోవ డం నేరమని స్పష్టం చేశారు.