21 July, 2026 | 12:34 PM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

21-07-2026 01:23 AM

అదనపు కలెక్టర్ బి హరిసింగ్ 

సూర్యాపేట, జూలై 20 (విజయక్రాంతి) :ప్రజల సమస్యల పరిష్కారమే వేదికగా సాగుతున్న ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.

అధికారులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను పెండింగ్లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్యలకి సంబందించి 68 దరఖాస్తులు, డీపీఓ 4, డిడబ్ల్యుఓ 4, డి ఆర్ డి ఓ 3, డి ఇ ఓ 3, వివిధ శాఖలకు సంబంధించి 24 దరఖాస్తులు రాగా మొత్తం 106 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ప్రేమ్ రాజ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.