14 May, 2026 | 3:28 AM

రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ

27-08-2024 06:18 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో రేషన్ కార్డు, హెల్త్ కార్డులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాలను సేకరణించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు అందించాలని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.