14 May, 2026 | 2:25 AM

తంత్రీవాద్యం కిన్నెర

28-08-2024 12:00 AM

జానపద కిన్నెర అ నేక తంత్రులు కలిగిన సంగీత వాయిద్యం. ఇంచుమించు గిటారులా ఉంటుంది. లోపల ఖాళీగా సుమారు 20 అంగుళాల వెదురుపై మైనంతో మధ్యగా నాలుగు మెట్లను అతికిస్తారు. మెట్లపై నుంచి రెండు తంత్రులను బిగుస్తారు. వెదురుకు ఒక చివర స్వర పేటిక ఉంటుంది. తెలంగాణలో జానపద కళా కారులు కిన్నెర వాయిస్తూ జీవనం సాగిస్తారు.

తెలంగాణలో రెండు రకాల కిన్నెర వాద్యాలు ఉన్నాయి. ఒకటి జానపదుల ఏడు మెట్ల కిన్నెర, రెండు ఆదివాసీల పన్నెండు మెట్ల కిన్నెర. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలో మాదిగలు, డక్కలి కులంవారు మాత్రమే ఏడు మెట్ల కిన్నెర వాద్యాన్ని వాయిస్తారు. చెంచు, గోండు ఆదివాసీలు పన్నెండు మెట్ల కిన్నెరని వాయిస్తారు. దీనికి బృహత్ కిన్నెర అని పిలుస్తారు. ఇది అత్యంత ప్రాచీనమైన తంత్రీ వాద్యం. చిన్న కిన్నెరని డక్కలివారు వాయిస్తూ పది వీరగాథలు పాడతారు. వాటిలో పండుగ సాయన్న, మీరేసాబు వంటి జనరంజకమైన కథలు ఉంటాయి. 

వాద్యం తయారీ: సొరకాయ బుర్రలు, తేనెతుట్టె నుంచి తీసిన మైనంతో కిన్నెరను తయారుచేస్తారు.