పనిచేయని ఏసీ.. ఇబ్బంది పడిన ప్రయాణికులు
19-06-2024 04:21 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ- దర్భంగా స్పైస్ జెట్ విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. స్పైస్‌జెట్ ఫ్లైట్ ఢిల్లీ నుండి దర్భంగా వెళ్లే ప్రయాణీకులు తీవ్రమైన వేడి పరిస్థితులలో గంటకు పైగా ఎయిర్ కండిషనింగ్ పనిచేయకపోవటంతో ఇబ్బంది పడ్డారు. విమానంలో గంటసేపు ఏసీ పనిచేయలేదు. ఏసీ పనిచేయకపోవడంతో విమాన ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. విమానంలో అధిక వేడితో కొందరు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1803344977537409305






