మరోసారి సుప్రీం కోర్టుకు కేజ్రివాల్
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నందున పొడిగించాలని కోరినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది.
కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ గడువు ముగియనున్న ఒక రోజు తర్వాత జూన్ 2న జైలు అధికారులకు లొంగిపోవాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేతను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేసినట్లు ఢిల్లీ మంత్రి అతిశీ మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయన చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఆమోదించడంతో మే 10న విడుదలయ్యారు.






